ఆగస్టు 30 నుంచి బిగ్ బాస్ నాలుగో సీజన్..?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (19:06 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించిన లోగోతో పాటు ఇందులో హోస్ట్‌గా నాగార్జున లుక్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేశారు నిర్వాహకులు. దీంతో బిగ్‌బాస్‌ 4పై ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ షో ప్రారంభయ్యేందుకు మరో 20 రోజుల సమయం పట్టనుందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 30 నుంచి ఈ షోను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
 
ఇక కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలతో ఈ సీజన్‌ను నిర్వహించబోతున్నారట నిర్వాహకులు. ఈ క్రమంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్‌లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు టాక్‌. వారితో పాటు టెక్నికల్ సిబ్బందిని కూడా క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను కూడా సెలక్ట్ చేశారని, చివరి నిమిషంలో ఎవరైనా డ్రాప్ అయితే వారి స్థానంలో ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను తీసుకోబోతున్నారని సమాచారం. 
 
మొత్తానికి కరోనా నిబంధనలను పాటిస్తూ ఏ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గకుండా ఈ సీజన్‌ని నిర్వాహకులు ప్రారంభించబోతున్నట్లు టాక్. మరి ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇంకా తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments