Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు బైబై చెప్పిన బిగ్ బి ఫ్యామిలీ.. ఆస్పత్రి నుంచి అభిషేక్ బచ్చన్ డిశ్చార్జ్ (video)

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:27 IST)
BIG B
బాలీవుడ్‌ నటుడు అభిషేక్ బచ్చన్‌ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారమే కరోనాను జయించా. ఈ మధ్యాహ్నం నాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. మీ అందరి ప్రార్థనలకు చాలా థ్యాంక్స్‌. ఇంటికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పట్ల మంచి కేర్ తీసుకున్న నానావతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి రుణపడి ఉంటాను. కరోనాను జయించేందుకు నాకు సాయం చేసిన నా కుటుంబానికి థ్యాంక్స్ అని అభిషేక్ ట్వీట్ చేశారు.
 
ఫలితంగా బిగ్ బి కుటుంబం కరోనాను జయించేసింది. అమితాబ్ బచ్చన్‌తో సహా కుటుంబమంతటికీ సోకిన కరోనా వైరస్ ఇప్పుడు నిష్క్రమించింది. కుటుంబంలో చివరి వ్యక్తి అభిషేక్ బచ్చన్ కూడా పూర్తిగా కోలుకున్నారు. అమితాబ్ కుటుంబాన్ని కరోనా వదల్లేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తెతో సహా అందరికీ కరోనా నిర్ధారణ కావడంతో నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 
 
ముందుగా ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె డిశ్చార్జ్ కాగా అనంతరం అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. చివరిగా ఇప్పుడు తాను కూడా కోలుకున్నానని... రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చిందని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. బిగ్ బి కుటుంబానికి కరోనా వైరస్ సోకిందని తెలియగానే బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. 
 
త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ల ద్వారా తమ సానుభూతి తెలిపారు. తన కోసం తన కుటుంబం కోసం ప్రార్ధనలు చేసినవాళ్లందరికీ చేతులెత్తి నమస్కారం చేశాడు అభిషేక్ బచ్చన్. నానావతి ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలకు సదా రుణపడి ఉంటానని చెప్పాడు అభిషేక్ బచ్చన్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments