బిగ్ బాస్ నామినేషన్.. అత్యధికంగా 13మంది వున్నారు.. ఇంట్లో గొడవే గొడవ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:27 IST)
బిగ్ బాస్‌ తెలుగులో సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్‌తో హీట్ ఎక్కింది. నాగార్జున ఇనయాకి వార్నింగ్ ఇవ్వడంతో ఇనయా, సూర్య కాసేపు గేమ్ గురించి మాట్లాడారు. ఇకపై తానేంటో చూపిస్తా అని ఇనయా చెప్పగా సూర్య కూడా ఇనయా ఇకపై గేమ్ ఆడేలా చేస్తాను అని చెప్పడం విశేషం.
 
ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఈ సారి బురద నీళ్లు పోసుకోవాలని నామినేట్ అయిన వాళ్ళు అని బిగ్‌బాస్ చెప్పడంతో ఓ షవర్ నుంచి బురద నీళ్లు పడుతుండగా దాని కింద కూర్చున్నారు నామినేట్ అయిన వాళ్ళు.  
 
అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే గీతూ, బాలాదిత్య మధ్యలో విబేధాలు వచ్చాయి. గీతూ బాలాదిత్యని నామినేట్ చేయడంతో నాగార్జున నువ్వు మోసం చేశావని ఓ వీడియో చూపించారు. కానీ అది నిజం అని ఇప్పుడు తెలుస్తుందని చెప్పి బాలాదిత్య బాగా హర్ట్ అయ్యాడు. 
 
ఇక శ్రీహాన్ ఇనయాని తాను చేసినవి గుర్తుచేయడంతో ఇనయా సీరియస్ అయి ఏం పీకుతావ్ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
 
శ్రీసత్య, రేవంత్ కి మధ్య కూడా పెద్ద గొడవే జరిగింది. ఇక అర్జున్, ఆదిరెడ్డి అయితే కొట్టుకునేదాకా వెళ్లారు. మెరీనా విషయంలో కూడా ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. మరోవైపు రాజ్, వాసంతి కూడా గొడవపడ్డారు. అందరూ బాలాదిత్యని మంచోడు అంటూనే ఈ వారం ఎక్కువమంది బాలాదిత్యని నామినేట్ చేయడం విశేషం. 
 
అలాగే రేవంత్‌ని కూడా నిద్రపోతున్నావు ఎక్కువగా అని చాలా మంది నామినేట్ చేయడంతో షర్ట్ విప్పేసి బురద నీళ్ల కింద కూర్చున్నాడు. చివర్లో పుష్ప లాగా తగ్గేదేలే అంటూ యాక్షన్ చేశాడు. రాజ్ కూడా షర్ట్ విప్పేసి బురద నీళ్ల కింద కూర్చున్నాడు.
 
మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో అత్యధికంగా 13 మంది నామినేట్‌ అయ్యారు. రేవంత్‌, బాలాదిత్య, రోహిత్‌, వాసంతి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఏడో వారం నామినేషన్స్ లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments