Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఆరో సీజన్- ఎవరు ఈ ఆదిరెడ్డి..? సెలబ్రేటీనా..?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (20:09 IST)
బిగ్ బాస్ సీజన్ ఆరో సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ నాగ్ ఈ సీజన్‌ను మరోసారి హుషారుగా హోస్ట్ చేయడనికి రెడీ అవుతున్నారు. ఈ షోలో పాల్గొనే వారి పేర్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోసుతున్నాయి.
 
వాటిలో ఆదిరెడ్డి అనే పేరు కూడా ఉంది . ఎవరు ఈ ఆదిరెడ్డి..? సెలబ్రేటీనా..? కాదు ఆదిరెడ్డి ఓ సామాన్యుడు. కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ గేమ్ గురించి తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషిస్తూ ఉంటాడు. అలా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
ఆదిరెడ్డి సొంతూరు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు. ఆయనది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు, అన్నయ్య, అక్కచెల్లెలితో కలిసి ఉంటారు ఆదిరెడ్డి. 
 
నెల్లూరులో డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు ఆదిరెడ్డి. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు. ఆ తరువాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ సీజన్-2ను వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 
 
ఆ వీడియో సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా వీడియోలు చేస్తూ తన సొంత యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేశారు. ఇలా బిగ్ బాస్ గురించి వివరించే ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments