అమెరికాలో ఫ్లోరిడాలో గగనంలో వెళుతున్న విమానంలో ఓ మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డకు స్కై అని పేరు పెట్టారు. ఈ సంఘటన అమెరికాలోని డెన్వర్ నుంచి ఒర్లాండో వెళుతున్న విమానంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్ నుంచి ఒర్లాండోకు ఓ విమానం బయలుదేరింది. ఇది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నిండుగర్భంతో షకేరియా మార్టిన్ అనే ప్రయాణికురాలికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో తక్షణం స్పందించి ఆ మహిళను బాత్రూంలోకి తీసుకెళ్లగా, అక్కడ ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
విమానంలో పుట్టిన ఆ పాపకు కుటుంబ సభ్యులు స్కై అని నామకరణం చేయడం విశేషం. షకేరియా సుఖ ప్రసవానికి సహకరించిన డయానును ప్రయాణికులు, విమానయాన సంస్థ అధికారులు ప్రశంసించారు.
మరోవైపు, విమానం గాల్లో ఉండగా జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు స్కైగా నామకరణం చేశారు. ఒర్లాండో విమానాశ్రయ సిబ్బందికి విషయం తెలియజేయడంతో విమానం ల్యాండ్ కాగానే షకేరియా, ఆమె బిడ్డను ఆసుపత్రికి తరలించారు.