బిగ్ బాస్ సీజన్-5 ఫైనల్ : ఆ ముగ్గురు ఔట్.. రేసులో ఇద్దరు!

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (21:46 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. ఇందులో తొలుత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సిరి. ఫైనల్ వారానికి ఐదుగురు అర్హత సాధించగా, వారిలో సిరి ఒకరు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్నా.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను స్టేజీపైకి తీసుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాగ్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందన్నారు. తాను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మానస, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముక్ ముగిలిపారు. ఆ తర్వాత మానస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసేందుకు 'శ్యామ్ సింగారాయ్' టీమ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టిలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. కానీ డబ్బు కోసం హౌస్‌లో మిగిలిన నలుగురు ఏమాత్రం ఆసక్తి చూచడం లేదు. దీంతో చివరగా నలుగురు బొమ్మలు వేలాడదీశారు. 
 
లీవర్ లాగినపుడు ఎవరి బొమ్మ కిందపడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించారు. ఇందులో మానస్ బొమ్మ కిందపడిపోవడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్‌లో మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, వీజే సన్నీలు ఉన్నారు. వీరిలో శ్రీరామ్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో సన్నీ, షణ్ముఖ్ మాత్రమే మిగిలివున్నారు. వీరిలో ఒకరు విజేతగా ఎంపికకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెంపుడు కుక్క గోళ్లు గీరుకుని ర్యాబిస్ వ్యాధితో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఉగ్రరూపం.. ఆ బాధేంటో నాకు తెలుసు (video)

AP Women: దసరా వేడుకలకు డ్రెస్ కోడ్ పాటిస్తున్న మహిళా మంత్రులు

Kushboo : చార్మినార్ బతుకమ్మ వేడుకల్లో సినీ నటి కుష్భూ.. మహిళలు ఇలా డ్యాన్స్ చేస్తుంటే? (video)

ఆ కలెక్టర్‌కు డ్రెస్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తేనే భయంగా ఉంది.. టి హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments