Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం నుంచి 'బిగ్ బాస్-4' సీజన్ : కంటెస్టెంట్స్ జాబితా ఇదే...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (11:19 IST)
అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచి, బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ప్రసారానికి రంగం సిద్ధమైంది. కరోనా, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా షోను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లే వారిలో దాదాపు 20 మంది పేర్లు లీక్ అయ్యాయి. వీరంతా ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. నటుడు నందు, ఇప్పటికే తాను హౌస్‌లోకి వెళుతున్నానని బహిర్గతం చేశాడు. 
 
ఈ సీజన్ కోసం మొత్తం 20 మంది జాబితాను సిద్ధం చేసుకున్న షో నిర్వాహకులు, 15 మంది పేర్లు ఖాయం చేశారని, మరికొందరు పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఖరారు చేసిన 15 మందిలో ఒకరి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో నాలుగో సీజన్‌ కోసం హౌస్‌లోకి వెళ్లనున్న కంటెస్టెంట్స్‌లో 'కృష్ణవేణి' సీరియల్ నటుడు సయ్యద్ సోహెల్, 'మహాతల్లి' ఫేమ్ జాహ్మవి, ఆమె భర్త సుశాంత్, జెమినీ టీవీ యాంకర్ ప్రశాంతి, గాయకుడు నోయర్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, గాయని గీతామాధురి భర్త నందు, 'జబర్దస్త్' ఫేమ్ ముక్కు అవినాష్, నటి కల్యాణి, యాంకర్, 'జోర్దార్' ఫేమ్ సుజాత, 'టిక్ టాక్' స్టార్ మెహబూబా దిల్ సే, దేత్తడి హారిక, కెవ్వు కామెడీ యాంకర్ అరియానా గ్లోరీ, 'టీవీ 9' యాంకర్ దేవిల పేర్లు ఖరారైనట్టు సమాచారం.
 
వీరితో పాటు హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామినీ భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది క్వారంటైన్‌లో వున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు లోపలికి వెళతారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments