Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విత్తన గణపతిని నిమజ్జనం చేసిన తనికెళ్ల భరణి

Advertiesment
విత్తన గణపతిని నిమజ్జనం చేసిన తనికెళ్ల భరణి
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (18:36 IST)
హైదరాబాదు లోని శ్రీనగర్ కాలనీ తన నివాసంలో తనికెళ్ళ భరణి విత్తన గణపతి గురించి మాట్లాడుతూ... రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - ఏకో ఫ్రెండ్లీ గణేష్‌లో భాగంగా కాదంబరి కిరణ్ గారి ద్వారా వినాయక చవితి ముందు విత్తన గణపతి విగ్రహాన్ని పంపించడం జరిగింది.
 
మా ఇంట్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాం. ఈ యొక్క విత్తన గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే ఒక విత్తనం ద్వారా కొన్ని రోజుల్లో ఒక మొక్క మొలుస్తుంది. ఆ మొక్కని అలాగే మన ఇంటి పరిసరాల్లో నాటుకోవాలి.
 
కొత్త జీవం మొక్క ద్వారా ఆవిర్భవిస్తుంది. ఆ మొక్కని పవిత్రంగా భావించి, పెంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం జీవించవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నను చూశాను.. అమ్మ ఎలా ఉందంటూ సైగతో అడిగారు.. హ్యాపీగా ఉన్నా : ఎస్పీ చరణ్