Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ -3 : ఎలిమినేషన్ జాబితాలో ఉన్నదెవరు?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:14 IST)
రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రసారాలు దిగ్విజయంగా మూడు వారాలు పూర్తి చేసుకుని, నాలుగో వారంలోకి అడుగుపెట్టాయి. అయితే, ఈ వారాంతం ఎలిమినేషన్ ప్రక్రియకు సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే, ఈ ఎలిమినేషన్ పక్రియ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉండనుంది. 
 
ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచి నామినేషన్‌ పక్రియ జరిపారు. ఇద్దరిలో ఎవరు సేవ్‌ అవుతారో, ఎవరు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతారో వాళ్లే చర్చించుకొని బిగ్‌బాస్‌కు చెప్పాలి. పునర్నవి, అలీ రెజాలకు ఇమ్యూనిటీ లభించిన కారణంగా వారిద్దరు నామినేషన్‌కు వెళ్లలేదు. ఇక శ్రీముఖి గత వారం టాస్క్‌లో తప్పు చేసిన కారణంగా ఆమె డైరెక్టుగా ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు. 
 
మిగిలిన సభ్యుల్లో తొలుత వితిక, రవిలు వెళ్లి ఎలిమినేషన్‌పై చర్చించుకున్నారు. టాస్క్‌ సమయంలో తాను తప్పు చేశాను కనుక ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవుతాను అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇక శివ జ్యోతి రోహిణిలలో శివజ్యోతి నామినేట్‌ అయి రోహిణిని సేవ్‌ చేసింది. వరుణ్‌, మహేష్‌లలో మహేష్‌ సేవ్‌ అవ్వగా వరుణ్‌ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యాడు. అషూరెడ్డి, బాబా భాస్కర్‌లలో అషూ సేవ్‌ అవ్వగా బాబా భాస్కర్‌ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. రాహుల్‌, హిమజలలో రాహుల్‌ ఎలిమినేషన్‌లో నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments