Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్-పునర్నవిల మధ్య ఏం నడుస్తుంది.. రొమాంటిక్ స్కిట్‌లో?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (15:22 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో క్రేజీ కాలేజీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. పాతదే అయినప్పటికీ టీచర్లుగా వరుణ్‌, వితిక, బాబా భాస్కర్‌లు విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. చిల్లాలజీ లెక్చరర్‌ వరుణ్‌ పెట్టిన పరీక్షలో స్టూడెంట్స్‌ మహేశ్‌, శివజ్యోతి, హిమజలు 5 స్టార్స్‌ తెచ్చుకోగా శ్రీముఖి, రాహుల్‌లు మాత్రం 4 స్టార్లతో వెనకబడిపోయారు.
 
ఇక గాసిపాలజీ టీచర్‌ వితిక నిర్వహించిన పరీక్షలో శివజ్యోతి టీచర్‌పైనే గాసిప్‌ సృష్టించగా, ఇద్దరి మధ్య ఎలా గొడవ పెట్టవచ్చు అనే ప్రశ్నకు శ్రీముఖి చెప్పిన సమాధానంతో టీచర్‌ను నోరెళ్లబెట్టేలా చేసింది.  
 
అనంతరం టీచర్‌ వితిక తాను విన్న గాసిప్‌లపై విద్యార్థులను ప్రశ్నించింది. మన గురించి గాసిప్‌ వస్తే అది గొప్ప విషయమని పునర్నవి పేర్కొంది. మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్‌-పునర్నవిలను నిలదీయగా అటు ఫ్రెండ్స్‌ కాదు, ఇటు లవర్స్‌ కూడా కాదు.. కాంప్లికేటెడ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పి పున్ను తప్పించుకుంది. 
 
ఇక హిమజ- మహేశ్‌లను పిలిచి గత నామినేషన్‌ ప్రక్రియలో కావాలనే మహేశ్‌ను సేవ్‌ చేయలేదా అని హిమజను ప్రశ్నించగా పొరపాటు వల్ల జరిగిందే తప్ప కావాలని చేయలేదని చెప్పింది. ఇక గాసిపాలజీ పరీక్షలో అందరికన్నా ఎక్కువగా శ్రీముఖి, పునర్నవి, రవి 4 స్టార్లను సాధించి ఆధిక్యంలో నిలిచారు. మిగిలిన లవ్వాలజీ పరీక్షలో భాగంగా స్టూడెంట్స్‌ లవ్‌ ప్రపోజల్‌ చేయాల్సి ఉండగా బాబా భాస్కర్‌, వితికలు జడ్జిలుగా వ్యవహరించారు. 
 
మహేశ్‌- శివజ్యోతి, రవి-శ్రీముఖి, మహేశ్‌- పునర్నవి, రాహుల్‌-హిమజలు జంటలుగా నటించారు. అందరూ పరవాలేదనిపించినా ఉన్నదాంట్లో రాహుల్‌-హిమజ జంట బాగా చేయడంతో వారిని విజేతలుగా ప్రకటించారు. ఇంకా రవి.. శ్రీముఖి రొమాంటిక్ కాస్త పండించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments