బోరున విలపిస్తూ బిగ్ బాస్ హౌస్ నుంచి తమన్నా నిష్క్రమణ

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (10:02 IST)
రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ నుంచి నటి తమన్నా బోరున విలపిస్తూ నిష్క్రమించింది. ఈ రియాల్టీ షో ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. ఈ షో ప్రసారాలు ప్రారంభమైన ఇప్పటికే మూడు వారాలు దాటిపోయాయి. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. 
 
ఎలిమినేషన్‌లో ఉన్న పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా తమన్నా ఎలిమినేట్ అయింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున తమన్నా పేరు చదవగానే బోరున విలపించింది. అయితే, తన కన్నీళ్లు బాబా భాస్కర్ కోసమేనని, ఆయనలాంటి తండ్రి తనకు ఉంటే బాగుండునని చెప్పుకొచ్చింది. 
 
పైగా, బిగ్‌బాస్ షోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. షోకి రావాలన్న తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది. బాబా భాస్కర్‌కు తాను కూతురిని అయి ఉంటే సూపర్ లేడీని అయి ఉండేదాన్నని కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, షో మధ్యలో నటుడు వెన్నెల కిశోర్ సందడి చేశాడు. "మన్మథుడు-2" ప్రమోషన్‌లో భాగంగా షోకి వచ్చిన వెన్నెల కిశోర్ హౌస్‌మేట్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments