Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 7: ఇంట్లో మంచాలు లేవు.. షకీలా-తేజల మధ్య ఆ టాపిక్?

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (12:47 IST)
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌస్‌లో మొదటి రోజు ఫైట్లు, నామినేషన్లు, సరదాలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో నటి షకీలా, జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది.
 
బిగ్ బాస్ తెలుగు 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. అయితే, వారు శాశ్వత ఇంటి సభ్యులేనని నాగార్జున పెద్ద బాంబు పేల్చారు. ఇంట్లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. టాస్క్‌లో భాగంగా, పోటీదారులు స్టోర్ రూమ్ నుండి బెడ్‌లు, సోఫాలు, ఇతర వస్తువులను తీసుకువచ్చారు. కానీ, ఇంట్లో మంచాలు లేవు. దీంతో ఇంట్లోని కొందరు సభ్యులు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు.
 
ఈ క్రమంలో షకీలా, తేజ నేలపై కూర్చుని మాట్లాడుకున్నారు. "అవును నువ్వు ఇలాంటి అడల్ట్ సినిమాలు ఎందుకు చేసావు? అని తేజ షకీలాను అడిగాడు. మీకు సినిమా ఆఫర్లు రాలేదా? నువ్వే చేశావా? అంటూ ప్రశ్నించాడు. 
 
ఇందుకు షకీలా సమాధానం ఇస్తూ.. ఆ సమయంలో నాకు ఎలాంటి అవకాశాలు వచ్చినా చేశాను. నేను వాటిని అంగీకరించాను. నాకు వచ్చినవన్నీ అడల్ట్ సినిమా ఆఫర్లే. ఇంతకు ముందు నేను షార్ట్ స్కర్ట్స్ వేసుకుని గ్లామరస్ సినిమాలు చేశాను. అని షకీలా సూటిగా సమాధానమిచ్చింది.
 
"ఇలాంటి సినిమాలు ఎన్ని తీశారు" అని అడిగాడు తేజ. 500కి పైగా సినిమాలు చేశాను.. అని షకీలా బదులిచ్చింది. దీంతో తేజ షాక్ అయ్యాడు.
 
అయితే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీంతో తేజ ప్రశ్నలు వేయడం మానేశాడు. అంతకుముందు గ్రాండ్ లాంచ్ రోజున తేజ మాట్లాడుతూ "నేను మీ అభిమానిని. నేను చిన్నప్పుడు నీ సినిమాలు చూసేవాడిని" అని అన్నాడు. ఇలా మొదటి రోజు, పోటీదారులు బిగ్ బాస్ హౌస్‌లో అడల్ట్ కంటెంట్ గురించి చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments