Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-7 ఎప్పుడంటే.. స్టార్ మా అధికారిక ప్రకటన..

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (15:07 IST)
పాపులర్ రియాల్టీ షో "బిగ్ బాస్" కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇది శుభవార్తే. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభ తేదీని స్టార్ మా ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. స్టార్ మా ఛానెల్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రసారం కానుంది. 'ఉల్టా పుల్టా' పేరుతో బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన ఇటీవలి ప్రోమో ఆకట్టుకుంది. 
 
ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని నాగార్జున చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. గ‌త ఆరు సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ బిగ్‌బాస్ సీజ‌న్ 7 వెరైటీగా ఉండ‌బోతోంద‌ని, ప్ర‌మోష‌న్ల‌తో అంచ‌నాల‌ను పెంచేసింది స్టార్. ఇప్పుడు 7వ సీజన్ ప్రారంభ తేదీని ప్రకటించారు. "బిగ్ బాస్ విప్లవానికి సిద్ధం! ఇది ముగింపు కాదు, సెప్టెంబర్ 3న గ్రాండ్ లాంచ్.#BiggBossTelugu7, ప్రత్యేకంగా #StarMaaలో" అని స్టార్ మా ట్వీట్ చేసింది.
 
బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కానీ సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్‌స్క్రీన్ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్, సీరియల్ నటి నవ్య స్వామి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ వర్ష బిగ్ బాస్ సీజన్ 7 హౌస్‌లోకి ప్రవేశించనున్నట్లు వినికిడి. 
 
జబర్దస్త్ నరేష్ పేరు కూడా చర్చలో ఉంది. యూట్యూబర్ అనిల్ గీలా, అటా సందీప్, సింగర్ మోహన భోగరాజు కూడా బిగ్ బాస్ 7 పోటీదారులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. మరి కొద్ది రోజుల్లో కంటెస్టెంట్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments