Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌: అప్పుడే విన్నర్ ఎవరో తేలిపోయిందా?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (11:18 IST)
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ విన్నర్ ఎవరో అప్పుడే తేలిపోయింది. మెజారిటీ ఇంటి సభ్యులు ఒక కంటెస్టెంట్‌కి అధికంగా ఓట్లు వేసి, టైటిల్ అతడిదే అన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు.
 
శనివారం హోస్ట్ నాగార్జున ప్రతి కంటెస్టెంట్‌ని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఇంట్లో ఉండటానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరని అడిగి తెలుసుకున్నాడు. కంటెస్టెంట్స్ అందరూ వరుసగా పేర్లు చెప్పారు. మెజారిటీ సభ్యులు శ్రీహాన్ తోపు అన్నారు. శ్రీహాన్ అన్నీ విషయాల్లో చాలా మెరుగ్గా వున్నట్లు ఓట్లు వేశారు. 
 
14 మంది కంటెస్టెంట్స్‌లో అత్యధికంగా ఏడుగురు సభ్యులు శ్రీహాన్ డిజర్వింగ్ అని మద్దతు తెలిపారు. శ్రీహాన్‌కి లభించిన ఓట్లతో అతడు టాప్-5లో కచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. అలాగే అతడు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్‌గా కూడా అవతరించే అవకాశం లేకపోలేదు. 
 
ఇక మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్‌గా మెరీనాకు ఓట్లు వేశారు. ఆమెకు అత్యధికంగా 5 ఓట్లు పడ్డాయి. దీంతో అతి త్వరలో మెరీనా ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments