Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ ఆరో సీజన్‌.. వాసంతికి రేవంత్ దగ్గర అవుతున్నాడా?

Advertiesment
Vasanthi_Revanth
, మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:19 IST)
Vasanthi_Revanth
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో భాగంగా కంటి స్టెంట్ రేవంత్‌పై ప్రస్తుతం వేరొక ప్రచారం జరుగుతోంది. వివాహం జరిగిన రేవంత్ అవివాహిత అయిన వాసంతికి దగ్గర అవుతున్నాడా? లేదా ఆమె పట్ల ఆకర్షితులవుతున్నాడా ? అనే విషయం ప్రస్తుతం ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ గీతూ మాటలతో ఈ వాదన తెరపైకి వచ్చింది. ఇక వాసంతిని రేవంత్ ఇష్టపడుతున్నట్లు చెప్పి గీతూ హాట్ కామెంటు చేసింది.
 
ఇకపోతే ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మెరీనా, అర్జున్, చంటి, ఇనయ మిగిలారు. ఇక స్టోర్ రూమ్‌లో ఉన్న లాలీపాప్స్ తీసుకురావాలని నాగార్జున రేవంత్‌ని ఆదేశించగా.. రేవంత్ ఎవరి పేరు రాసిన లాలిపాప్ వాళ్లకు ఇచ్చేశాడు. 
 
ఇక లాలీపాప్ రాపర్ ఓపెన్ చేయాలని.. గ్రీన్ కలర్ అంటే సేఫ్, రెడ్ ఉంటే అన్ సేఫ్ అని నాగార్జున చెప్పాడు. ఇక మెరీనాకు గ్రీన్ కలర్ వచ్చి ఆమె సేఫ్ అయింది. మిగతా ముగ్గురు డేంజర్ జోన్‌లో మిగిలారు. ఇక వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టాలని రేవంత్‌కి నాగార్జున చెప్పినప్పుడు మాకు కావాలని కంటెస్టెంట్‌లు అడిగారు. 
 
ముఖ్యంగా గీతూ.. రేవంత్ చేతిలోంచి లాక్కొనే ప్రయత్నం చేసింది. వారించిన నాగార్జున హౌస్ గురించి ఒక సీక్రెట్ చెబితే తీసుకోవచ్చని చెప్పినప్పుడు గీతూ ఇలా .. రేవంత్ లేడీ కంటెస్టెంట్ వాసంతి పట్ల సాఫ్ట్‌గా ఉంటున్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది. ఇకపోతే వాసంతి సింగిల్ అయినప్పటికీ రేవంత్ మాత్రం వివాహం జరిగింది.
 
ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గీతూ చేసిన ఈ కామెంట్స్ ఆమె భార్య వింటే ఏమనుకుంటుంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ..కానీ అసలు విషయం ఏమిటంటే రేవంత్ వాసంతి పట్ల స్నేహపూర్వకంగా ఉన్నాడే తప్ప ఇంకొక ఆలోచన చేయలేదు. ఆ విషయాన్ని రేవంత్ భార్య స్పష్టంగా అర్థం చేసుకుంది. ఫ్యాన్స్ కూడా అతనిని బాగా అర్థం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, అల్లు అర‌వింద్ మ‌ధ్య విభేదాల మాట నిజ‌మేనా!