Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్: బిగ్ బాస్ నుంచి గంగవ్వ అవుట్.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (17:22 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఐదో వారంలో కొన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతోన్నాయి. ముఖ్యంగా గంగవ్వ విషయంలో. గంగవ్వ ఈ వారం నామినేషన్‌లో కూడా లేదు. కానీ ఆమెను బిగ్ బాస్ ఆట నుంచి వెళ్లిపోయింది. గంగవ్వ షో నుంచి బయటకు వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
 
అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగింది? ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం. నాల్గో సీజన్‌లో గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్. ఈ విషయాన్ని నాగార్జునే కంటెస్టెంట్లందరికీ చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని అదేశించాడు. అయితే గంగవ్వను కూడా అందరూ జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఆమెకు బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడట్లేదు. తిండి దిగట్లేదని చెప్తూ వచ్చింది. దీంతో ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ ఆమెను బయటికి పంపించారు. 
 
గత మూడు రోజులుగా గంగవ్వకు మళ్ళీ ఇంటి మీద ద్యాస మళ్లినట్టు ఉంది. శుక్రవారం జరిగిన మార్నింగ్ మస్తీలో తన చనిపోయిన కూతురిని తలచుకుని బాగా ఏడ్చేసింది గంగవ్వ. ఇక ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో గంగవ్వ హౌజ్ నుండి బయటకు వచ్చేస్తుందని టాక్. కేవలం ఆరోగ్యం బాగాలేకనే ఆమెను నామినేషన్స్ లో లేకపోయినా సరే హౌజ్ నుండి బయటకు పంపిస్తున్నారని తెలుస్తుంది. ఈరోజు గంగవ్వ హౌజ్ నుండి బయటకు వస్తుందట. 
 
అంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కథ విని అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొన్న అవ్వ ఎలాగైనా గెలవాలని ప్రార్థిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో గంగవ్వ మాట్లాడుతూ తాను బిడ్డను కోల్పోయిన సంఘటనను వివరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. "ఐదేళ్లప్పుడే పెళ్లి. 17 ఏళ్లకే కొడుకు. ఇంకో రెండేళ్లకే కూతురు పుట్టింది.
 
తాగి కొట్టే భర్త విదేశాలకు పోయిండు. ఓ రోజు నా కూతురుకు ఫిట్స్ రావడంతో ఆమెను ఎత్తుకుని నడక ప్రారంభించాను. అప్పుడు ఊర్లోకి బస్సు వచ్చేది కాదు. కానీ ఊరి నుంచి వెళ్లే ఓ బండి నన్ను చూసి ఎక్కించుకుంది. 
 
అలా జగిత్యాల ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పగానే బిడ్డను ఎత్తుకుని వెనుదిరిగాను. బస్ ఎక్కబోతే శవంతోని లోపలకు రానీయలేదు. ఆటోలో ఇంటికి వెళ్లాను" అని గంగవ్వ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు అవ్వకు వచ్చిన బాధ ఎవ్వరికీ రావొద్దని కామెంట్లు చేస్తున్నారు.

ఆదివారం కూడా నామినేషన్స్ లో ఉన్న తొమ్మిదిమంది హౌజ్ మేట్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. కాగా బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ కేవలం ఐదువారాల అగ్రిమెంట్ ‌తోనే వచ్చిందని అది పూర్తయింది కాబట్టి ఆమెను బయటకు పంపిస్తున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments