Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్ ఆ ఇద్దరూ మిస్సింగ్.. ఎలిమినేషన్‌కు ముందే పారిపోయారా?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (12:59 IST)
రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ఇపుడు మూడో వారం చివరి దశకు చేరుకుంది. అయితే, బిగ్ బాస్ నుంచి అలీ, పునర్నవిలు కనిపించకుండా పోయారు. వీరిద్దరూ ఎలిమినేషన్‌కు ముందే పారిపోయారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లలో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అలీ, పునర్నవి మిస్సింగ్ కావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మరోవైపు, సభ్యులకు కెప్టెన్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో నిధి ద‌క్కించుకునేందుకు ర‌వికృష్ణ నిధి బాక్స్ అద్ధాన్ని చేతితో ప‌గ‌ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేసి గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ వివాదం గురించి 19వ ఎపిసోడ్‌లో కూడా చ‌ర్చ జరిగింది. వితిక ఆ సంఘ‌ట‌న గురించి త‌ల‌చుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. ఆమెని వ‌రుణ్‌, రాహుల్‌లు ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.
 
ర‌వికృష్ణ‌కి గాయం కావడానికి కార‌ణం శ్రీముఖి అని ఇంటి స‌భ్యులు బిగ్ బాస్‌కి చెప్ప‌డంతో ఆమెని వ‌చ్చే వారం ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్ చేశారు బిగ్ బాస్. అంతేకాదు ఈ టాస్క్‌ని కూడా రద్దు చేశారు. ఇక ఆ త‌ర్వాత అలీ రాజా, పునర్న‌విని ఒక్కొక్కరిగా క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిపించిన బిగ్ బాస్ వారికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేస్తే ఇమ్యునిటి ల‌భిస్తుంది. దాంతో వ‌చ్చే వారం నామినేష‌న్ కాకుండా ఉంటార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. దీంతో ఆ సీక్రెట్ టాస్క్‌లో వారిద్ద‌రు పాల్గొనేందుకు ఆస‌క్తి చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments