Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ బిగ్ బాస్‌లో కొత్త ప్రయోగం.. ఇన్విజిబుల్ ప్రక్రియ..

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (17:21 IST)
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో బిగ్ బాస్‌కు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకులను రక్తి కట్టించే అంశం అని చెప్పాలి. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ మాదిరిగా.. బిగ్ బాస్‌లో ప్రతీవారం ఎంతో సస్పెన్స్ నడుమ ఒక్కో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసి పంపిస్తారు. ఇప్పటివరకు ఇదే కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా నో ఎలిమినేషన్ అంటూ హిందీ బిగ్ బాస్ సరికొత్త చేస్తున్నారు. 
 
ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియతో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. ఆ స్థానంలో 'ఇన్విజిబుల్' అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన భాషల్లో కూడా దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. బిగ్ బాస్ 14లో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని.. దానికి బదులుగా ఇన్విజిబుల్ ప్రక్రియ ఉంటుందని హోస్టు సల్మాన్ ఖాన్ తెలిపాడు.
 
ఆ ప్రక్రియలో భాగంగా లీస్ట్ ఓటింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ల (షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సాను)లో ఎవర్ని ఎంచుకుంటారని సల్మాన్.. హౌస్‌లో ఉన్న సీనియర్లందరూ షెహజాద్ డియోల్ పేరును ఎంచుకున్నారు. దీనితో అతడ్ని ఎలిమినేట్ చేయకుండా.. బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు. 
 
హౌస్‌లో షెహజాద్ డియోల్ ఇన్విజిబుల్ పేరుతో ఉన్న దుస్తులు ధరిస్తాడని.. ఏ ఒక్క టాస్కులో గానీ.. మిగిలిన హౌస్‌మేట్స్ తీసుకునే నిర్ణయాల్లో అతని ప్రమేయం ఉండదని హోస్ట్ సల్మాన్ ఖాన్ చెప్పారు. కేవలం బిగ్ బాస్ ఆదేశించిన నియమాలను మాత్రమే పాటిస్తాడని తెలిపారు. ఇక అప్పటికీ కూడా ఇన్విజిబుల్ కంటెస్టెంట్ ప్రవర్తన నచ్చకపోతే బిగ్ బాస్ ఏ క్షణంలోనైనా అతడ్ని బయటికి పంపిస్తాడని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments