Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోబోను చాలా మిస్ అవుతున్నాను.. ఉమాదేవి ఎమోషనల్...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:17 IST)
Umadevi
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది. ఇందులో అర్థపావు భాగ్యంగా అలరించే ఉమాదేవి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం అందుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి అతి తక్కువ సమయంలోనే ఇంటి దారి పట్టింది. 
 
తాజాగా సోషల్ మీడియా లైవ్‌లో ఉమాదేవి మాట్లాడుతూ.. అందరి లవ్ సపోర్ట్ వల్లే ఇంత వరకు వచ్చాను అంటూ.. బిగ్ బాస్ షో నుంచి మంచి పేరుతో బయటకు రావడం సంతోషంగా ఉందని కానీ రెండో వారంలోనే బయటికి రావడం బాధగా ఉందని తెలిపింది. అందులోనే ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని తెలిపింది. ఇక తనకు ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిర్‌గా అనిపించిందని ఆ విషయంలో చాలా బాధపడ్డానని తెలిపింది. 
 
ఏం జరిగినా అంత మంచిదే అనుకొని ఒకవేళ మళ్లీ రీ ఎంట్రీ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను అని తెలిపింది. ఇక తను ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటానని కానీ వాళ్లంతా తనను తప్పుగా అర్థం చేసుకొని తను మాట్లాడే మాటలకు భయపడ్డారని వెల్లడించింది. 
 
లోబోను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ గా తెలిపింది. ఇక ఈ షో స్క్రిప్టు కాదని తెలిపింది. తను చేసిన పాత్రల వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని.. మళ్లీ సీరియల్స్‌‌కి పెళ్లి అర్ధపావు భాగ్యంగా అలరిస్తానని తెలిపింది. ఇక మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చారో లేదో తెలియడం లేదు.. కానీ.. మా డాక్టర్ బాబు బాగుండాలి.. మా దీప బాగుండాలి త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments