Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొనసాగుతున్న వివేకా హత్య కేసు : పులివెందుల కోర్టులో శంకర్ రెడ్డి?

Advertiesment
YS Viveka Murder Case
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన ఉమా శంకర్‌ రెడ్డిని అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్నమరో ఇద్దరు నిందితులు అధికారుల ముందు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉమా శంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా విచారణ కోసం సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్‌ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యాంగులకు ఇంటికే టీకాలు వేయలేరా? కేంద్రానికి సుప్రీం నోటీసు