Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా అంటే రంగుల ప్రపంచం కాదు.. మాయా ప్రపంచం.. మోసం చేశారు.. భూమిక

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (09:58 IST)
సినీ నటి భూమిక ఎన్నో సంవత్సరాలుగా తన మనసులోని దాచుకున్న ఓ బాధను వెళ్లగక్కారు. చిత్రపరిశ్రమ అంటే రంగుల ప్రపంచం కాదని, మాయా ప్రపంచమని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, తనను కొందరు మోసం చేశారని ఆమె ఆరోపించారు. లేకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. 
 
ఈమె హిందీలో నటించిన తొలి చిత్రం "తేరే నామ్". మంచి విజయం సాధించింది. దీంతో భూమికకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 'తేరే నామ్' చిత్రం తర్వాత భారీ ఆఫర్ ఒకటి వచ్చింది. అయితే నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తొలగించారని చెప్పారు. ఆ సినిమా టైటిల్‌ను కూడా మార్చేశారని చెప్పారు. ఆ సినిమాలో తాను నటించివుంటే ఇపుడు తన పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. 
 
ఆ సినిమా గురించి తాను ఏదోదో  ఊహించుకున్నానని, మరో సినిమాకు కూడా సైన్ చేయకుండా యేడాది వేచి చూశానని చెప్పింది. అంతేకాకుండా, "జబ్ వీ మెట్" సినిమాకు కూడా తొలుత తానే సంతకం చేశానని చెప్పారు. తనకు జోడీగా బాబీ డియోల్‌ను తీసుకున్నారని, ఆ తర్వాత ఆయన్ను తప్పించి, షాహిద్ కపూర్‌ను తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత తనను కూడా తీసేశారని వివరించారు. చివరకు ఆ చిత్రంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించారని భూమిక తాజాగా తన మనసులో దాచుకున్న మాటను బహిర్గతం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments