Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి భావనపై లైంగిక దాడి.. హీరో ప్రమేయం ఉందట.. ప్రతి ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు..

నటి భావనపై లైంగిక దాడి ప్రస్తుతం మూలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మహాత్మ వంటి సినిమాలో శ్రీకాంత్‌ సరసన నటించిన భావనపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఒకడైన మణికండన్‌ను పోలీసులు అదుపులోకి

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:20 IST)
నటి భావనపై లైంగిక దాడి ప్రస్తుతం మూలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మహాత్మ వంటి సినిమాలో శ్రీకాంత్‌ సరసన నటించిన భావనపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఒకడైన మణికండన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు భావనపై లైంగికదాడి జరిగిన కారులో సేకరించారు. ఇక ఈ కేసులో ఒక హీరో హస్తం ఉందంటూ కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో కుట్ర కోణం దిశగా కూడా దర్యాప్తు జరుగుతుందని కేరళ సర్కారు స్పష్టం చేసింది. 
 
ఈ దాడిలో హస్తమున్న ప్రతి ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కేరళ సినిమాటోగ్రఫీ మంత్రి స్పష్టం చేశారు. దర్యాప్తు కేవలం కిరాయి గూండాలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక ఉన్నవారందరినీ పట్టుకుంటామని ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఏకే బాలన్‌ ప్రకటించారు. భావన తన ఫిర్యాదులో పేర్కొన్న నేరపూరిత కుట్ర సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపిస్తామని పేర్కొన్నారు.
 
ఇకపోతే.. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న మణికండన్ ఎర్నాకుళంలోని తమ్మనం ప్రాంతానికి చెందినవాడు‌. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్‌ సుని, మరో నిందితుడు వీపీ విగీష్‌తో కలిసి ముందస్తు బెయిల్‌ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మిగతా ఇద్దరి కోసం కేరళ పోలీసు బృందాలు తమ రాష్ట్రంతోపాటు తమిళనాడులోనూ తీవ్రస్థాయిలో జల్లెడ పడుతున్నాయి. కాగా.. వీరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేరళ హైకోర్టులో మంగళవారం విచారణకు రాగా జడ్జి హియరింగ్‌ను మార్చి 3కు వాయిదా వేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం