Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు వైఎస్ మరణం, ఇప్పుడు అమ్మ మరణం తీరని లోటుః విజయ్ ఆంటోనీ

జయలలిత మరణం తమిళనాడుకి తీరని లోటు. సింహంలా బతికారు. అంత త్వరగా మరణిస్తారని ఎవరూ అనుకోలేదు. పెద్ద రాజకీయ నాయకురాలు మరణించినప్పుడు కన్‌ఫ్యూజన్‌ ఏర్పడడం కామన్‌.

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (05:16 IST)
జయలలిత మరణం తమిళనాడుకి తీరని లోటు. సింహంలా బతికారు. అంత త్వరగా మరణిస్తారని ఎవరూ అనుకోలేదు. పెద్ద రాజకీయ నాయకురాలు మరణించినప్పుడు కన్‌ఫ్యూజన్‌ ఏర్పడడం కామన్‌. లాస్ట్‌ టైమ్, తెలుగు రాష్ట్రంలో సీయంని (వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి) కోల్పోయినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నటువంటి సమస్యలే ఎదురయ్యాయి అని చెబుతున్నారు తమిళ చిత్ర హీరో విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా నటించిన ‘యమన్‌’ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తాజా సినిమా యమన్ కథకు ప్రస్తుత తమిళనాడు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 
 
‘‘ప్రస్తుత తమిళనాట రాజకీయాలకూ, ఈ చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు జీవశంకర్‌ ఐదేళ్ల క్రితమే ఈ కథ రాశారు. తమిళనాడు మాత్రమే కాదు... దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకూ కథ, సినిమా నచ్చుతాయి. ప్రాంతాలను బట్టి రాజకీయ నాయకులు మారతారు కానీ, రాజకీయాలు ఎక్కడైనా ఒక్కటే. రాజకీయ నాయకుల ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది’’ అన్నారు విజయ్‌ ఆంటోని.
 
రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు ఎలా పనిచేస్తారు అసలేం చేస్తారు అనేవి తెలుసు. కానీ, ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేయలేరు. చాలా కష్టమైన పని. మేం దాన్ని డిఫరెంట్‌ యాంగిల్‌లో చూపించాం. రాజకీయ నేపథ్యంలో వస్తున్న వినూత్న కథా చిత్రమిది. ఓ సామన్య వ్యక్తి మంత్రి ఎలా అయ్యాడనేది చిత్రకథ. పొలిటికల్‌ థ్రిల్లర్‌ డ్రామా అని విజయ్ ఆంటోనీ యమన్ చిత్రి విశేషాలు తెలిపారు. తప్పుడు రాజకీయ నాయకుల పట్ల యముడిలాగా వ్యవహరించటమే ఈ చిత్రంలో తన పాత్ర అని చెప్పారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments