Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుమతి రామకృష్ణ సినిమా వివాదం, ఇంతకీ ఏమైంది..?

Webdunia
బుధవారం, 1 జులై 2020 (22:52 IST)
నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం భానుమతి రామకృష్ణ. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించారు. వెబ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్‌కు మంచి స్సందన రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని ఆహా ద్వారా రిలీజ్ చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
 
నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ ఉంది. అయితే... ఊహించని విధంగా ఈ సినిమాపై వివాదం వచ్చిపడింది. ఇంతకీ వివాదం ఏంటంటే... ఈ మూవీ టైటిల్ భానుమతి రామకృష్ణ.
 
ఇంతకీ విషయం ఏంటంటే.... అలనాటి నటి భానుమతి రామకృష్ణ తనయుడు, మా అమ్మ పేరును టైటిల్‌గా పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. తమని సంప్రదించకుండా ఆ టైటిల్ ఎందుకు పెట్టారు...? అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.
 
ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే... భానుమతి రామకృష్ణ మూవీ టీమ్ మాత్రం ఆమె పేరుకు ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. అయితే... అల్లు అరవింద్ రంగంలోకి దిగారని... ఇప్పుడు ఎలాంటి వివాదం లేదని అంటున్నారు. మొత్తానికి ఈ చిన్న సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. సో... ఆశించిన సక్సెస్ సాధించడం ఖాయం అంటున్నారు టీమ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments