Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి చిత్రంతోనే టాలెంటెడ్ ప్రదర్శించిన హీరోయిన్ భైరవి

దేవి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (14:29 IST)
Bhairavi
టాలీవుడ్ స్క్రీన్ కు  గ్లామర్ హీరోయిన్ భైరవి పరిచయం కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇది ఆమెకు తోలి  మూవీ అయినప్పటికీ సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో యాక్టింగ్ పరిణతి చెందినట్లు నటించిందని చిత్ర యూనిట్  చెపుతోంది. 
 
శివ ద‌ర్శ‌క‌త్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియ‌ర్ న‌టీన‌టులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి త‌దిత‌రులు నటించారు.
 ఈ సంద‌ర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా న‌టించే ఈ సినిమా కోసం  హీరోయిన్ గా భైరవి తెలుగు తెర‌కు తొలి ప‌రిచ‌యం చేస్తున్నాం. అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో భైరవి స‌రిగ్గా స‌రిపోతుంది. హీరోకి మ‌ర‌ద‌లు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ము. ప్ర‌స్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న‌ది. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్, విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం.'' అని అన్నారు.
 
న‌టీన‌టులు: ఆకాష్, భైరవి, రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య త‌దిత‌ర‌లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగా గాడిని వదలను: మద్యం మత్తులో వర్థమాన నటి చిందులు (Video)

Shivaratri: శివరాత్రికి ముస్తాబవుతున్న హైదరాబాద్ శివాలయాలు

భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం: ఢిల్లీ నుంచి జైపూర్‌కి 30 నిమిషాల్లో...

Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Young driver: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌‌లో వ్యక్తి హత్య.. నేర చరిత్ర.. ముఠాలో చేరలేదని ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments