Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టిన ప్రేమ పావురాలు హీరోయిన్

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (16:15 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాథాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది.
 
అయితే... ప్రభాస్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ను సీనియర్ హీరోయిన్ బయటపెట్టింది. ఇంతకీ ఏంటా సీక్రెట్..? ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? ఆ హీరోయిన్ భాగ్యశ్రీ. ప్రేమ పావురాలు సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.
 
 ఈ సీనియర్ హీరోయిన్ ప్రభాస్ నటిస్తున్న రాథేశ్యామ్ సినిమాలో ప్రభాస్‌కి తల్లిగా నటిస్తుంది. ఇక ఏంటా సీక్రెట్ అంటారా... ప్రభాస్ అంటే కోట్లాది మంది అమ్మాయిలకు పిచ్చి.
 
మరి ప్రభాస్‌కి టీనేజ్‌లో ఎవరంటే అంటే పిచ్చి? అంటే.. హీరోయిన్ భాగ్యశ్రీ అట. అవును.. ఈ విషయాన్ని స్వయంగా భాగ్యశ్రీ చెప్పడం విశేషం. నా పైన చాలా క్రష్ ఉండేదట. నా ఫొటోస్ కలెక్ట్ చేసేవాడినని ప్రభాస్ చెప్పాడు. అంతగా నాపై క్రష్ ఉండేదని చెప్పడం నాకు హ్యాపీగా అనిపించింది అని తెలిపింది 50 ప్లస్ భాగ్యశ్రీ.
 
ఈ సినిమాలో ప్రభాస్‌కి తల్లిగా భాగ్యశ్రీ అంటే.. ఎలా ఉంటుందో అనుకుంటున్నారు కానీ... తెరపై చూడండి. అందరూ చాలా బాగుంది అంటారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పింది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎంతవరకు ఆకట్టుకుంటుందో..? ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments