Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు : ఆర్థిక ఇబ్బందులతో నటుడు సూసైడ్

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (11:01 IST)
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఇలాంటివారిలో చాలా మంది పూటగడవని స్థితి వుంది. దీంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగాలీ న‌టుడు సువో చక్రబర్తి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
అవ‌కాశాలు రాక‌, దాని వ‌ల‌న ప‌లు అర్థిక ఇబ్బందుల‌ని ఎదుర్కోవ‌ల‌సిన ప‌రిస్థితి త‌లెత్త‌డంతో ఫేస్‌బుక్ లైవ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. బెంగాలీలో ‘మంగళ్ చాంది’ మరియు ’మానస’ వంటి సీరియల్స్‌తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన‌ సువో చక్రబర్తి జూన్ 8 అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ.. స‌డెన్‌గా నిద్ర మాత్ర‌లు మింగాడు. 
 
ఇది చూసిన ఆయ‌న ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు వెంట‌నే పోలీసుల‌కి స‌మాచారం అందించ‌డంతో వెంటనే రంగంలోకి దిగిన రక్షక భటులు అతన్ని హాస్పిటల్‌ చేర్చి ప్రాణాలను కాపాడారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం బాగానే ఉంది. ఆగ‌స్ట్ నుండి ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతుండ‌గా, చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు సువో చక్రబర్తి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments