Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా : ఫ్లాట్‌లో శవమై కనిపించిన బెంగాలీ నటి... హత్యా.. ఆత్మహత్యా?

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ నటి శవమై కనిపించింది. తమ ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (14:16 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ నటి శవమై కనిపించింది. తమ ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన నటి బితస్తా సాహా కోల్‌కతాలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహం పాక్షికంగా చెడిపోయినట్లు పోలీసులు తెలిపారు. 
 
గత రెండు రోజులుగా బితస్తా తల్లి కుమార్తెకు ఫోన్‌ చేస్తుంటే సమాధానం లేకపోవడంతో ఆమె బుధవారం ఉదయం తన కుమార్తె ఒంటరిగా ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చారు. ఎంత సేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు పగలకొట్టి చూడగా ఆమె సీలింగ్‌ ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. ఆమె శరీరం కూడా పాక్షికంగా కుళ్ళిపోయింది. అంతేకాదు మృతదేహంపై పలు చోట్ల గాయాలున్నాయి, మణికట్టు దగ్గర చీలిక కూడా ఉందని పోలీసులు గుర్తించారు.
 
ప్రాథమిక దర్యాప్తులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపామని, రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఒత్తిడి కారణంగా నటి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు. ఆమె ఫోన్‌కాల్‌ వివరాలతో సహా అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments