ఈ కరోనా టైంలో సీసీసీ వ‌ల్ల‌నే కడుపునిండా తినగలుగుతున్నాం అంటున్నారు - బెన‌ర్జీ

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (14:54 IST)
ఇది సినీప‌రిశ్ర‌మ‌కు, సినీకార్మికుల‌కు క‌ష్ట‌కాలం. ఉపాధి లేక బ‌తుకు తెరువు లేక ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌య‌మిది. ఇలాంటి స‌మ‌యంలో మెగాస్టార్ ప్రారంభించిన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) వేలాది కార్మికుల్ని ఆదుకుంది. ఇప్ప‌టికే ఒక ద‌ఫా నిత్యావ‌స‌ర స‌రుకుల్ని పంపిణీ చేసి ఆదుకున్నారు. రెండో ద‌ఫా నిత్యావ‌స‌రాల్ని సీసీసీ క‌మిటీ స‌ర‌ఫ‌రా చేస్తోంది. మా స‌భ్యులకు కొంతమందికి రెండో ద‌ఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా సీసీసీ క‌మిటీ స‌భ్యుడు బెన‌ర్జీ మాట్లాడుతూ-``ఇది చిరంజీవి గారి ఐడియా. సినీకార్మికుల‌కు సాయ‌ప‌డాల‌ని సీసీసీ ప్రారంభించారు. దీనికి హీరోలు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు.. అలాగే బ‌య‌టి నుంచి దాత‌లు సాయం చేశారు. ఇండ‌స్ట్రీలోని ఆర్టిస్టులు.. టెక్నీషియ‌న్లు స‌హా కార్మికులెంద‌రికో ప‌నుల్లేక డ‌బ్బుల్లేక ఇబ్బందులు త‌లెత్తాయి.
 
ఎటూ దిక్కుతోచ‌ని స‌మ‌యంలో క‌నీసం మూడు పూట‌లు కడుపునిండా భోజ‌నం వ‌ర‌కూ అయినా సాయం చేయ‌గ‌లిగినందుకు సీసీసీకి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్టుల సంఘం స‌భ్యులంద‌రికీ సీసీసీ స‌రుకులు అంద‌జేసింది. అంద‌రి త‌ర‌పున చిరంజీవి గారి త‌ర‌పున దాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో మూవీ ఆర్టిస్టుల సంఘం ఉపాధ్య‌క్షురాలు హేమ‌, కమిటీ స‌భ్యులు ఏడిద శ్రీ‌రామ్, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు. సీసీసీ నుంచి నిరంత‌రం ఈ సేవ‌లు అందుతాయ‌ని వీరంతా వెల్ల‌డించారు. అలాగే ఇటీవల కొంతమంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మా ట్రెజరర్ రాజీవ్ కనకాల నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments