Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్, దిల్ రాజుల ప్లాన్ ఏంటి..?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (14:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌తో అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ కావడంతో ప్రారంభం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
సమ్మర్లోనే థియేటర్ లోకి వస్తుంది అని ఎదురుచూసిన అభిమానులకు కరోనా వచ్చి షాక్ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడంతో వకీల్ సాబ్ సెట్స్ పైకి వస్తాడు అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. దీంతో అసలు.. పవన్, దిల్ రాజు ప్లాన్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... దసరాకి వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే... దసరాకి రావడం కష్టం అనే క్లారిటీ వచ్చేసింది. అందుచేత వకీల్ సాబ్‌ని సంక్రాంతికి థియేటర్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందుచేత.. అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేసినా డిసెంబర్‌కి కంప్లీట్ అవుతుంది. జనవరిలో రిలీజ్ చేయచ్చు అనే ప్లాన్లో ఉన్నారట. అందుకనే పవన్, దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా విషయంలో సైలెంట్‌గా ఉన్నారని టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments