Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్స్ అద‌ర‌గొట్టిన సోనూసూద్.. సినిమా, మీడియా రెండూ నా కుటుంబం..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (17:05 IST)
sonu sood
బాలీవుడ్ స్టార్‌, టాలీవుడ్‌కు విల‌న్ అయిన సోనూసూద్ కొత్త కేరెక్ట‌ర్ చేస్తున్నాడు. సోనూ సూద్ మళ్ళీ తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అలా ప్రస్తుతం సోనూ సూద్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో “అల్లుడు అదుర్స్” అనే సినిమాలో నటిస్తున్నాడు. గ‌త వారంరోజులుగా హైద‌రాబాద్ అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో ఈ సినిమా కోసం పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. 
 
ఇందులో హీరో హీరోయిన్ల‌తోపాటు సోనూసూద్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. సోనూసూద్ అద్భుతంగా డాన్స్ చేశాడు. ఈ సంద‌ర్భంగా త‌ను డాన్స్ చేసిన చిత్రం చూడ‌వచ్చు. ఇది సినిమాలో క్ల‌యిమాక్స్‌లో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా గురించి సోనూసూద్ మాట్లాడుతూ.... చాలా కాలం త‌ర్వాత ఇలా మీడియా ముందుకు వ‌చ్చి అంద‌రితో షేర్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా వుంది. 
sonu sood
 
మీడియా, సినిమా రెండూ నా కుటుంబం. 8 నెల‌ల త‌ర్వాత కెమెరా ముందుకు వ‌స్తున్నాను. సినిమా అనేది ప్ర‌తి ఒక్క‌రినీ ప్రియం. అందుకే చ‌క్క‌ని మెసేజ్ ఇస్తుంటారు. మ‌ర‌లా థియ‌ట‌ర్ల‌ల‌కు.. వ‌చ్చేలా ఈ సినిమా చేస్తుంది. కందిరీగ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ నాకు ఇచ్చిన అవ‌కాశం ఇది. ఇందులో పాట ఆలా జోష్‌గా వుంటుంది. ఇంత‌వ‌ర‌కు పెద్ద‌గా డాన్స్ చేయ‌లేదు. కానీ ద‌ర్శ‌కుడు సంతోష్ నా చేత డాన్స్ చేయించాడు. కో స్టార్లు అంద‌రూ బాగా స‌హ‌క‌రించారు అని తెలిపారు. ఈ పాట‌కు శేఖర్ మాస్టర్ సారథ్యం వ‌హించారు.
 
ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. న‌టీన‌టులంతా ఆలా ఎమోష‌న్‌గా క‌నెక్ట్ అయ్యా‌రు. క‌రోనాను మ‌ర్చిపోయేలా మంచి సినిమా ఇది. చ‌క్క‌టి సంగీతందేవిశ్రీ ఇచ్చాడు. ఛోటా కెమెరా అద్భుతం. అను  .సోన‌నూసూద్‌.. ప్ర‌పంచానికి తెలుసు. పెద్ద న‌టీన‌టులు ఇందులో వున్నారు.  ఈరోజు సినిమా పూర్తి కావ‌డానికి అంద‌రూ ప‌నిచేశారు. ముఖ్యంగా జ‌న‌వ‌రికి అద్భుత‌మైన వినోదాన్ని ఇస్తున్నాం. అల్లుడు అదుర్స్ టైటిల్‌లాగే మంచి వినోదాన్ని వ‌చ్చే సంక్రాంతికి ఇస్తుంది అన్నారు.
Sonu Sood
 
క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ తెలుపుతూ.. వినోదంతోపాటు మంచిగా అల‌రించే క‌థ సంతోష్ శ్రీ‌న్‌గారు ఇచ్చారు. ఐదేళ్ళ త‌ర్వాత మంచి కుటుంబ‌క‌థా చిత్రం చేస్తున్నా. సోనూసూద్‌, న‌బాన‌టేష్‌, చాలామంది న‌టీన‌టులు వున్నారు. చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి ప‌నిచేశారు. బ‌డ్డెట్‌కు వెనుకండా.. గంజిర‌మేష్‌, సుబ్ర‌‌హ్మ‌ణ్యం నిలిచారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో నూ నిరా్మ‌త మాకు స‌పోర్ట్ ఇచ్చారు. నిర్మాత‌లు మాట్లాడుతూ...  సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నాం. అంద‌రికీ మంచి వినోదం ఇస్తుంది... అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments