Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఏమిటి నీ ధైర్యం..? రోబో 2.0తోనే పెట్టుకుంటావా?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (14:58 IST)
అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలో న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క, సాక్ష్యం చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌లేదు. దీంతో ఎలాగైనా స‌రే భారీ విజ‌యం సాధించాలి.. కెరీర్లో ముందుకు వెళ్లాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. తాజాగా క‌వ‌చం అనే సినిమా చేసాడు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నారు. 
 
ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇందులో సాయి శ్రీనివాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టించాడు. అయితే... ఈ సినిమాను డిసెంబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఈ నెల 29న ర‌జ‌నీకాంత్ రోబో సీక్వెల్ 2.0 రిలీజ్ కానుంది. ర‌జ‌నీ - శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ కాబ‌ట్టి రెండు వారాలు క‌లెక్ష‌న్స్ ఎలాగూ ఉంటాయి. అందుచేత థియేట‌ర్స్ దొర‌కాలంటే కాస్త ఇబ్బందే.
 
అలాంటిది 2.0 రిలీజైన వారానికే క‌వ‌చం సినిమాతో బెల్లంకొండ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుండ‌టం విశేషం. మ‌రి.. ఇది క‌వ‌చం సినిమాపై వారికున్న న‌మ్మ‌క‌మా..? లేక 2.0 సినిమాపై అనుమాన‌మా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments