Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాక్షసుడు' గా బెల్లంకొండ శ్రీనివాస్?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:24 IST)
మొదటి సినిమా 'అల్లుడు శీను' తర్వాత అంత మాత్రం హిట్ సాధించలేకపోయిన బెల్లంకొండ శ్రీనివాస్... తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. గత ఏడాది తమిళంలో హిట్ సాధించిన 'రాచ్చసన్' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందనుంది. తమిళంలో విష్ణు విశాల్.. అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా తమిళనాట భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రీమేక్‌కి నిర్మాతగా కోనేరు సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.
 
కాగా, రమేశ్ వర్మ ఈ సినిమాకి 'రాక్షసుడు' అనే టైటిల్‌ని ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి హీరోగా 'రాక్షసుడు' వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఆ మధ్య సూర్య నటించి తెలుగులోకి అనువదించబడిన సినిమా కూడా 'రాక్షసుడు' టైటిల్‌తోనే తెలుగులోకి వచ్చింది. 
 
మళ్లీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి అదే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. ఈ టైటిల్ ఖాయమైపోయినట్లేనని అంటున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడిగా రానున్నారో... లేదా మరే పేరుతోనైనా రానున్నారో... వేచి చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments