Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ గా సంతోషంగా గర్వంగా ఉంటె బెటర్ అనేలా మ్యాడ్ నుంచి సాంగ్ వచ్చింది

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:54 IST)
MAD single song
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మునుపెన్నడూ చూడని తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'తో అలరించడానికి సిద్ధమవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాతో సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయమవుతున్నారు.
 
ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పై సాయి సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
ధమాకా వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మ్యాడ్ సినిమా నుంచి సెప్టెంబర్ 14న "ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్" అనే సింగిల్స్ గర్వించదగిన గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.
 
ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా.. సింగిల్ గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. 'ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్' పాట సంగీతం ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఇక సాహిత్యం యువత మెచ్చేలా.. ముఖ్యంగా లింగభేదాలు లేకుండా ప్రతి యొక్క సింగిల్ ని కట్టిపడేసేలా ఉంది. 
 
ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. 
 
నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్' పాట ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం

రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు... అనేక రైళ్లు రద్దు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments