Colors Swathi Reddy, Srikanth Nagoti, Yashwant Mullukutla
నటిగా చాల కాలం విరామం తీసుకున్న కలర్స్ స్వాతిరెడ్డి తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రంతో రాబోతుంది. నవీన్ చంద్ర ఇందులో నటించారు. గతంలో భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నవీన్ చంద్ర, స్వాతి అందంగా కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ నిర్వహించింది.
స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. 'మంత్ ఆఫ్ మధు' లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. మనకు చిన్నప్పుటి నుంచి ఎదో చెప్తారు, ఎదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమాలో చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా వుంటుంది. ఈ మా సినిమాలో వున్నా నిజాయితీ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. దర్శకుడే ఈ కథ రాశారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు. అలాగే బాధ పడే సినిమా కూడా కాదు. ధైర్యం ఇచ్చే సినిమా. అక్టోబర్ 6న మీ ముందుకు వస్తోంది. నవీన్ తో పాటు అందరికీ థాంక్స్. నన్ను గుర్తుపెట్టుకొని ఇంత ప్రేమ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ.. నవీన్ చంద్ర గారితో మళ్ళీ కలసి సినిమా చేయాలనుకున్నపుడు ఈ కథని అనుకున్నాం. స్వాతి గారు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా టీం వర్క్. నటీనటులు, టెక్నికల్ టీం గొప్పగా సహకరించారు. మేము ఎంత ప్యాషనేట్ గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. అక్టోబర్ 6న సినిమాని ప్రేపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది
యశ్వంత్ మాట్లాడుతూ.. నవీన్ చంద్ర మేము కలసి చేసిన మా మొదటి చిత్రం భానుమతి & రామకృష్ణకి ప్రేక్షకులు, విమర్శకులు గొప్పగా ఆదరించారు. మరో సినిమా చేసే స్ఫూర్తిని ఇచ్చారు. అదే 'మంత్ ఆఫ్ మధు'. ఒక రియలిస్ట్ క్ సినిమా చేయాలని ఈ సినిమాని మొదలుపెట్టాం. బెస్ట్ యాక్టర్స్, టెక్నికల్ టీం వుంది. నవీన్, స్వాతి గారితో పాటు అందరూ మంచి ప్రతిభగల నటులు వున్నారు. ప్రేక్షకులకు సహజసిద్దమైన అనుభూతిని ఇవ్వడానికి సింక్ సౌండ్ లో షూట్ చేశాం. తొంబై శాతం షూటింగ్ వైజాగ్ లో చేశాం. అన్నీ రియల్ లోకేషన్స్ లో చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.
ఈ చిత్రంలో శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని కీలక పాత్రలు పోషించారు.
అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి ఎడిటర్ కావడం సర్ ప్రైజ్.
నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ తదితరులు.