Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బప్పిలహరి' గొంతు మూగబోయిందా? క్లారిటీ ఇచ్చిన సింగర్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:37 IST)
ప్రముఖ బాలీవుడ్ సింగర్ బప్పిలహరి కరోనా వైరస్ బారినపడిన తర్వాత ఆయన గొంతు మూగబోయిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా జరిగింది. ఈ వార్త భారతీయ చిత్రపరిశ్రమలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై ఈ సింగర్ క్లారిటీ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వివరణ ఇచ్చారు. 
 
నిజానికి సోషల్ మీడియాలో అనేక రకాలైన తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రాణంతోవున్నవారిని చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం సర్వసాధారణంగా మారిపోయింది. 
 
అలాంటి పరిస్థితే బప్పిలహరి విషయంలోనూ జరిగింది. బప్పిలహరికి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన త్వరగానే కోలుకున్నారు. అయితే కరోనా సోకడం మూలాన అతని గొంతు పోగొట్టుకున్నారని పలు వార్తలు వైరల్ కాగా వాటి అన్నిటికీ బప్పిలహరి తన గొంతుతోనే సమాధానం ఇచ్చారు. 
 
తన గొంతుతోనే పాట పాడి ఆ వీడియోని షేర్ చేసి తాను బాగానే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది. బప్పిలహరి కెరీర్‌లో ఎన్నో హిస్టారికల్ హిట్ నంబర్స్ కూడా ఉన్నాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’  పాట దేశం మొత్తాన్ని షేక్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments