'ది డెవిల్ ఈజ్ బ్యాక్' : "బంగార్రాజు" పోస్టర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (14:53 IST)
అక్కినేని నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు 29వ తేదీని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బంగర్రాజు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆదివారం ఉదయమే 'ది గోస్ట్' సినిమాకు సంబంధించి విడుదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే బంగర్రాజు చిత్రం ఫోస్టర్ విడుదల చేశారు. 
 
గత 2016లో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి 'బంగార్రాజు' ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 'వైల్డ్ డాగ్‌'లో చివరిసారిగా కనిపించిన నాగార్జున 'బంగార్రాజు'లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 'మనం' తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్‌పై కన్పించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఇందులో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. 
 
ప్రీక్వెల్ “బంగార్రాజు”లో నాగ చైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై జీ స్టూడియోస్ సహకారంలో అక్కేనేని నాగార్జున నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments