పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో తనకు నచ్చని విషయంపై నిర్మొహమాటంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ గురవుతున్న బండ్ల తాజాగా మరో ట్వీట్‌తో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ కుర్ర హీరోల తీరుపై కొద్దిగా ఘాటుగానే స్పందించడంతో పాటు పవన్‌ను చూసి నేర్చుకోమని సలహా ఇచ్చాడు.
Chiranjeevi
విషయం ఏంటంటే.. టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఒక ఈవెంట్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఆ ఫోటోను, దాంతో పాటు పెద్దల ముందు వినయంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ 'నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం' అని చెప్పుకొచ్చాడు. ఒక హోదా వచ్చిందని ఎగిరెగిరి పడకండని, కొద్దిగా సంస్కారం నేర్చుకోండంటూ క్లాస్ పీకాడు.