Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టార్ కిడ్స్ టాలెంట్ ఉంటేనే రాణిస్తారు - చోర్ బజార్ హీరో ఆకాష్ పురి

Suresh Varma, Suresh Bobbili, Gehanna Sippy, Vishwak Sen, Akash Puri, VS Raju, Jeevan
, గురువారం, 23 జూన్ 2022 (16:41 IST)
Suresh Varma, Suresh Bobbili, Gehanna Sippy, Vishwak Sen, Akash Puri, VS Raju, Jeevan
మా నాన్న స్టార్ డైరెక్టర్ కాక ముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. మా నాన్న అన్నీ ఇచ్చారు. ఆయన నా పక్కన లేకుంటే నేను జీరో ఆ విషయం నాకు తెలుసు- అని ఆకాష్ పురి అన్నాడు. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న చోర్ బజార్  ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,  చోర్ బజార్ సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ కారణం. సురేష్ బొబ్బిలి చేసిన పాటలకు వేల రీల్స్ చేస్తున్నారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశారు. నిర్మాతలు లాక్ డౌన్ లో సినిమా ఆగిపోయినా, బడ్జెట్ పెరిగినా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గెహనా సిప్పీకి కెరీర్ లో ఎదగాలని ఎంతో తపన ఉంది. ఈ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి క్రియేట్ చేసిన మ్యాజిక్ అనుకోవచ్చు. ఇలా టీమ్ అంతా పడిన శ్రమే ఈ సినిమా. హీరోగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వక్, మా బాబాయ్ సాయిరామ్, బండ్ల గణేష్ కు థాంక్స్. ఇతనికేంటి పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ నేను మా నాన్న స్టార్ డైరెక్టర్ కాక ముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. మా నాన్న అన్నీ ఇచ్చారు. ఆయన నా పక్కన లేకుంటే నేను జీరో ఆ విషయం నాకు తెలుసు. అందుకే సొంతగా నాకంటూ ఓ పేరు గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. రేపు మా అమ్మకు, చెల్లికి ఒక కొడుకుగా అన్నయ్యగా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా. స్టార్ కిడ్స్ అంటే రాగానే స్టార్స్ అయిపోరు, వాళ్లలో టాలెంట్ ఉంటేనే అవుతారు. నా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ నన్ను నేను మెరుగుపర్చుకుంటున్నా. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా. మాతో పాటు రిలీజ్ అవుతున్న సమ్మతమే, ఇతర సినిమాలూ విజయం సాధించాలి. అన్నారు.
 
దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ...జీవన్ దర్శకుడిగా సినిమా బాగా చేస్తావని నీ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయితో మంచి సినిమా చేయ్ అని చెప్పి ఆకాష్ ను నాతో పంపించారు పూరి జగన్నాథ్. ఆయన మాట నిలబెట్టుకుంటానని పూర్తి నమ్మకం ఉంది. ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ యాక్టర్. బచ్చన్ సాబ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. గెహనా సిప్పీ మంచి హీరోయిన్ అవుతుంది. అర్చన మేడమ్ రూపంలో నాకు అక్క దొరికింది. నా నెక్ట్ సినిమాలోనూ ఆమె డేట్స్ ఇవ్వాలి. చోర్ బజార్ ను కలర్ ఫుల్ ఫిల్మ్ గా మార్చింది మా టీమ్ మెంబర్సే. ఆర్ట్ వర్క్ నుంచి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వరకు అంతా కష్టపడి మంచి సినిమా చేశారు. అన్నారు.
 
బండ్ల గణేష్ మాట్లాడుతూ...ఆకాష్ పూరి స్టార్ అవడానికే పుట్టాడు. అతనిలో ఆ టాలెంట్ ఉంది.  ఆకాష్ స్టార్ కాకుండా ఎవరూ ఆపలేరు. మా గబ్బర్ సింగ్ సినిమాలో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ గా నటించినప్పుడే ఆకాష్ పెద్ద హీరో అవుతాడని ఫిక్స్ అయ్యా. దర్శకుడు జీవన్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు, మేధావి, అతనితో ఎక్కువ సేపు మాట్లాడితే నాకు భయమేస్తుంది. ఆయన లాస్ట్ సినిమా చాలా బాగుంది. ఆకాష్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు స్టార్ అయ్యాక మీ నాన్నకు డేట్స్ ఇవ్వొద్దు. మీ నాన్న నీతో సినిమా చేసేందుకు క్యూలో నిల్చోవాలి అంత పెద్ద హీరో కావాలి.  ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి అని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ... చోర్ బజార్ అనేది కలర్ ఫుల్ కమర్షియల్ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారు. సినిమా సక్సెస్ మీద కాన్ఫెడెన్స్ తో ఉన్నాం. జీవన్ ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకునేవాడిని. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. పృథ్వీ అనే స్టంట్ మాస్టర్ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. ఈ సినిమాతో ఆకాష్ కు హిట్ గ్యారెంటీ. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ కార్మికుల సమ్మె... 28 సినిమాల షూటింగులు బంద్