తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ నిర్మాణ కార్మికులు మూకుమ్మడి సమ్మెకు దిగారు. 24 క్రాఫ్ట్‌లకు చెందిన సినీ నిర్మాణ కార్మికులు సమ్మె చేయడంతో 28 చిత్రాల నిర్మాణాలు ఆగిపోయాయి. నిజానికి కరోనా మహమ్మారి కారణంగా చిత్రపరిశ్రమ అనే ఇబ్బందులు ఎదుర్కొంది. ఇపుడుడిపుడేగాడిన పడుతుంది. ఇంతలోనే మరో సంక్షోభం ఉత్పన్నమైంది. తమ వేతనాలు పెంచాలని కోరుతూ సినీ నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.
మరోవైపు, కార్మికుల వేతనాలు పెంచడంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాతల మండలి ప్రకటించింది. కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరుకావాలని, లేకపోతే ఆరు నెలల పాటు షూటింగులు నిలిపివేస్తామని హెచ్చరించారు. కానీ, కార్మికులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.