Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేష్-పవిత్రలకు రహస్య వివాహం జరిగిందా..? మహాబలేశ్వర్‌లో..?

Advertiesment
Naresh_Pavitra
, గురువారం, 23 జూన్ 2022 (10:00 IST)
Naresh_Pavitra
టాలీవుడ్‌లో ప్రస్తుతం సీనియర్ రమేష్ వివాహమే పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై పవిత్ర-నరేష్ స్పందించలేదు. కానీ వీరిద్దరికీ ఇప్పటికే రహస్యంగా వివాహం జరిగిపోయిందని తాజాగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
పవిత్ర లోకేష్ మొదటి భర్తతో విడిపోయారు. ఆమెకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. అందుకే కేవలం సన్నిహితుల సమక్షంలో రహస్యంగా వీరి వివాహం జరిగిందట. ఈ వార్తలకు బలం చేకూర్చేలా నరేష్, పవిత్ర లోకేష్ పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు.
 
సడన్ గా ఈ జంట మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ టెంపుల్‌ని సందర్శించిన నరేష్, పవిత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. 
 
వీరి మహాబలేశ్వర్ విజిట్‌ జరిగింది కొద్ది రోజులైనా.. ఈ విజిట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  
 
సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవిత్ర లోకేష్ నేపథ్యం చూస్తే ఆమె కన్నడ అమ్మాయి. 1995లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్‌లో హీరోయిన్‌గా, సైడ్ హీరోయిన్ రోల్స్ చేశారు. తెలుగులో పవిత్ర లోకేష్ ఫస్ట్ మూవీ దొంగోడు. రవితేజ హీరోగా 2003లో విడుదలైన ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర చేశారు. 
 
2010 నుండి పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన అంటే సుందరానికీ, సర్కారు వారి పాట, రెడ్, డియర్ మేఘ, అర్ధ శతాబ్దం వంటి చిత్రాలు విడుదలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు ఫంక్షన్‌కు రావడానికి పూరికి టైమ్ లేదా? కడిగిపారేసిన బండ్ల గణేష్