Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్‌'కు కష్టాలు.. చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రధానికి లేఖ

adipurush
Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (14:15 IST)
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ - హీరోయిన్ కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్ర కథ అసలైన రామాయణంకు చెందిన స్టోరీ కాదని, నిజ స్టోరీని వక్రీకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. 
 
సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెంటనే సినిమాను నిలిపివేయాలని ఆ లేఖలో కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా ఓ లేఖ రాశారు. అంతేకాకుండా, ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌, సంభాషణ రచయిత మంటసిక్ శుక్లా, నిర్మాతపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశాలని ఆయన డిమాండ్ చేశారు.
 
'ఆదిపురుష్‌' హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్నీ తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. శ్రీరాముడు అందరికీ దేవుడు. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయి. దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చిత్రీకరించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన చిత్రం భాగం కాకూడదు. శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ సినిమా పూర్తిగా విధ్వంసం చేసింది. దీనిని వెంటనే నిలివేయండి. భవిష్యత్తులో ఓటీటీలో కూడా దీనిని ప్రదర్శించవద్దు. ఈ మేరకు ఆదేశించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం' అని లేఖలో పేర్కింది. ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రైటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments