అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (18:32 IST)
వివిధ కారణాలతో ఇప్పటికే పలు చిత్రాలు వాయిదాపడుతున్నాయి. తాజాగా అఖండ-2 చిత్రం ఆ జాబితాలో చేరింది. ముందుగా ప్రకటించిన తేదీకి ఈ సినిమా విడుదల చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారు. భారీ తరహాలో రూపొందిస్తున్న ఈ సినిమా రీరికార్డింగ్, వీఎఫ్ఎక్ సహా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలకు మరింత సమయం పడుతుందని అందుకే వాయిదా వేస్తున్నట్టు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీ వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. బాలకృష్ణ  - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనివున్నాయి. గతంలో వచ్చిన అఖండకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
అలాలగే, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబరు 25వ తేదీన విడుదలకానుంది. దీంతో దసరా పండుగకు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుందని సినీ ప్రియులు భావించారు. అయితే, ఈ రెండు చిత్రాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఓజీ టీమ్ మాత్రం  ఈ వార్తలను ఖండించింది. అనుకున్న తేదీకి చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండకు కొనసాగింపు కావడం, ఈ సారి హీరో పాత్ర అంతకుమించి ఉండటంతో అఖండ-2పైనా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments