Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయ‌పాటి బర్త్ డేకి బాలయ్య షాకింగ్ గిఫ్ట్... ఏంటది?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:25 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా త‌ర్వాత ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్న‌ట్టు స్వ‌యంగా బాల‌కృష్ణ ఎనౌన్స్ చేసారు. ఫిబ్ర‌వ‌రి నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాల‌నుకున్నారు కానీ..కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత బోయ‌పాటి చ‌ర‌ణ్‌తో తీసిన విన‌య విధేయ రామ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే డౌట్. 
 
బాల‌య్య త‌దుప‌రి చిత్రం బోయ‌పాటితో ఉంటుందా అని. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఈ సినిమా ఉంటుంది అనుకున్నారు. అయితే... బోయ‌పాటికి బాలయ్య షాక్ ఇచ్చారు. ఏమైందో ఏమో కానీ... గురువారం సాయంత్రానికి సీన్ మారిపోయింది. 2018 సంక్రాంతికి తనకు జై సింహా అనే ఓ మాదిరి విజయాన్ని అందించిన సినిమా డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్‌తో పని చెయ్యాలని బాల‌య్య‌ డిసైడ్ అయ్యారు. 
 
ఈ మేరకు నిర్మాత సి. కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్ సినిమా మే నెలలో లాంఛనంగా మొదలై, జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. మరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందా? ఉంటే ఎప్పుడు? కె.ఎస్. రవికుమార్ సినిమా తర్వాత ఆయనతో చేస్తాడా?.. అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. అయితే.. బోయ‌పాటి పుట్టిన‌రోజు నాడే బాల‌య్య షాక్ ఇవ్వ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments