నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:17 IST)
మెగా బ్రదర్ నాగబాబు... నందమూరి బాలకృష్ణ గురించి కామెంట్ చేయడం.. అది చర్చనీయాంశం అవ్వడం తెలిసిందే. ఇటీవలే కాకుండా గతంలో కూడా నాగబాబు.. బాలయ్య గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. చిరంజీవి, నాగార్జున మరికొంత మంది సినీ ప్రముఖులు వెళ్లి షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది.
 
ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో బాలయ్య తన మనసులో మాటలను మీడియా సాక్షిగా బయటపెట్టారు. భూములు పంచుకోవడం కోసమే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మీటింగ్ పెట్టారంటూ బాలయ్య కామెంట్ చేయడం సినీరాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ నాగబాబు బాలయ్యపై కామెంట్ చేయడంతో బాలయ్య, నాగబాబు మధ్య వార్ నడుస్తుంది అంటూ వార్తలు రావడం తెలిసిందే.
 
సోషల్ మీడియాలో అటు చిరు అభిమానులు ఇటు బాలయ్య అభిమానులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేయడంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. అయితే... ఈ వివాదం గురించి బాలయ్యను అడిగితే...ఛీ, ఛీ... నేనేమంటాను.. అన్నీ ఆయనే(నాగబాబే) మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్‌గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments