Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతే కాదు.. దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది : బాలకృష్ణ

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో హీరో పాత్రను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తుంటే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Balakrishna
Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (11:56 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో హీరో పాత్రను ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తుంటే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ సొంతూరు అయిన నిమ్మకూరుకు శనివారం వెళ్లింది. చిత్రం షూటింగ్‌లో భాగంగా, నిమ్మకూరులో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. అందుకే నిమ్మకూరు పరిసరాలు, ఎన్టీఆర్ బంధువుల గురించి తెలుసుకునేందుకు చిత్ర యూనిట్ అక్కడ పర్యటించింది.
 
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఎవరైతే వాళ్లు పుట్టిన కుటుంబానికి ఊరికి, జాతికి, దేశానికి ఖ్యాతిని తీసుకొస్తారో వాళ్లే మహానుభావులు అనిపించుకోవడానికి అర్హులు. వారిలో ఎన్టీఆర్ ఒకరు. ఒక తండ్రి పాత్రలో కొడుకు నటించడమనేది చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. కొడుకే తండ్రి జీవిత చరిత్రను నిర్మించడం. నిర్మాతగా నా మొదటి సినిమా కావడం.. నా బ్యానర్‌లో తీయడం.. ఒక కాకతాళీయమన్నారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం షెడ్యూల్‌లో భాగమే నిమ్మకూరు రావడం జరిగిందన్నారు. క్రిష్‌కి నిమ్మకూరులోని మా బంధువులందరినీ పరిచయం చేశాను. తెలుగు జాతే కాదు.. దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది. నిమ్మకూరు అక్టోబర్ చివరిలో కానీ.. నవంబర్‌లో కానీ షూటింగ్ ఉంటుందని బాలయ్య వివరించారు. 
 
అంతేకాకుండా, 'నిమ్మకూరు అనేది ఆయన పుట్టిన ఊరు. వ్యక్తిగతంగా ఆయన సినిమా చేయడానికి కారణాలు.. ఒకటేమో ఒక నటుడిగా నాపై ఉన్న ప్రభావం.. రెండవది తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం. ఎన్టీఆర్ ఎన్నో పథకాలకు ఆయన నాంది పలికాడు. దేశం మొత్తం కూడా ఆ పథకాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి అలాంటి మహనీయుడి కథను భావితరాలకు అందజేయాలని నాకు అనిపించింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments