Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పెళ్లి చేసుకోబోతున్నాను అందరూ రండి: షారూఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి డాన్, డాన్-2 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా వివాహం నిక్‌ జోనాస్‌‌తో జరుగనుందని టాక్. నిక్ జోనాస్ పుట్ట

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (11:31 IST)
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి డాన్, డాన్-2 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా వివాహం నిక్‌ జోనాస్‌‌తో జరుగనుందని టాక్. నిక్ జోనాస్ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 16న వీరిద్దరి వివాహం జరుగనుందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. తన పెళ్లి గురించి ప్రియాంక చోప్రా నోరెత్తట్లేదు. 
 
దీంతో మీడియా ప్రియాంక చోప్రా సన్నిహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వోగ్‌ బ్యూటీ అవార్డ్స్ వేడుకకి వెళ్ళిన షారూఖ్‌ని మీడియా ప్ర‌తినిధులు ప్రియాంక పెళ్లి గురించి అడిగారు. దీంతో షారూఖ్ .. ప్రియాంకే కాదు నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మెహందీ వేడుక‌తో పాటు రిసెప్ష‌న్‌కి మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తాను... త‌ప్ప‌క అందరూరండి అంటూ చ‌మ‌త్క‌రించాడు. దీంతో చుట్టూ ప‌క్క‌ల వారంద‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.
 
మరోవైపు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహం ఎప్పుడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ‌ధ్య కంగనా ర‌నౌత్‌ని ప్రియాంక పెళ్లి గురించి అడిగితే.. ప్రియాంక ఎంగేజ్‌మెంట్ చేసుకుంద‌నే విష‌యం తనకు తెలియదని చెప్పింది. త‌ర్వాత ప్రియాంక‌కి కాల్ చేసి శుభాకాంక్ష‌లు చెప్పాన‌ని, ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసుకుంటాననే ఆసక్తితో ప్రియాంక వుందని కంగనా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments