NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

చిత్రాసేన్
సోమవారం, 3 నవంబరు 2025 (17:53 IST)
NBK 111 update poster
నందమూరి బాలక్రిష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో ఎన్.బి.కె. 111 లో హీరోయిన్ అప్ డేట్ వస్తుందని ఈరోజు నిర్మాతలు సోషల్ మీడియాలో ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదలచేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ అప్ డేట్ రావాల్సి ఉంది. అయితే, ఈ అప్ డేట్ ను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
 
అందుకు ప్రధాన కారణం కూడా తెలియజేస్తూ, రీ పోస్ట్ చేశారు. చేవెళ్ల సమీపంలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. బాధిత కుటుంబాలకు చిత్ర బృందం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని ఎన్.బి.కె. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
 
2010లో సింహా, 2011లో శ్రీరామరాజ్యం, 2018లో జై సింహా, ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలియజేశారు. వీరిద్దరిదీ మంచి పెయిర్ అంటూ కితాబిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.  కథగా చూస్తే,  హిస్టారికల్ బ్యాక్ డ్రాప్  కొంత భాగం వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని వార్త వినిపిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్ లో కోటల రెక్కీ లో వున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
 
నవంబర్ 7న పూజా కార్యక్రమం తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. S.S. థమన్ సంగీతం అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments