జైపూర్‌లో జూనియర్ రాజమౌళికి పెళ్లి... 'బాహుబలి' తరహా సెట్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:35 IST)
'బాహుబలి' చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమ స్థాయినేకాకుండా, తన పేరును సైత్యం విశ్వవ్యాప్తం చేసుకున్న దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. ఈయన తనయుడు కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందుకోసం పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ వివాహం కోసం బాహుబలి సెట్ తరహాలో పెళ్ళి వేదికను నిర్మించనున్నారు. 
 
కాగా, ప్రముఖ హీరో కమ్ విలన్ జగపతిబాబు అన్నయ్య రాంప్రసాద్ కుమార్తె అయిన పూజా ప్రసాద్‌తో కార్తికేయకు ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహం ఈనెల 30వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వివాహ వేడుకకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ వేదిక కానుంది. జైపూర్‌లోని ప్యారామౌంట్ హోటల్‌లో జరుగనున్న ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సెలబ్రెటీస్‌ మాత్రమే హాజరుకానున్నారు. 
 
వివాహ వేదికను 'బాహుబలి' సెట్టింగ్ రేంజ్‌లో నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 250 ఎకరాల్లో కట్టిన 7 స్టార్ లగ్జరీ హోటల్ ప్యారామౌంట్ మొగల్ స్టైల్ ప్యాలెస్‌ని తలపించే విధంగా ఉంటుంది. ఇక్కడ కార్తీకేయ వివాహ వేడుక వైభవంగా జరగనుంది. దీంతో రెండు రోజుల తర్వా కార్తీకేయ వివాహ వేడుకతో రాజమౌళి కుటుంబం ఫుల్ బిజీకానుంది. 
 
కాగా, రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్‌లో బీజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో తొలి షెడ్యూల్ పూర్తికానుంది. ఆ తర్వాత రాజమౌళి తన కుమారుడు పెళ్లి వేడుకల్లో బిజీగా గడుపనున్నారు. అలాగే, రాజమౌళి వద్దే కార్తికేయ కూడా క్రియేటివిటీ విభాగంలో పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments