Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్సీస్‌లో రూ. 200 కోట్ల వసూళ్లవేపుగా బాహుబలి-2 పరుగు.. అనితరసాధ్యం ఈ రికార్డ్

ఇప్పటికే వెయ్యికోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగా అరుదైన రికార్డును నమోదు చేసిన బాహుబలి-2 చిత్రం ఇప్పుడు ఓవర్సీస్ లోనూ చరిత్ర సృష్టించే దిశలో సాగుతోంది. ఓవర్సీస్ సినీ ప్రియులు బాహుబలికి అడిక్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. అమెర

Webdunia
గురువారం, 11 మే 2017 (01:29 IST)
ఇప్పటికే వెయ్యికోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగా అరుదైన రికార్డును నమోదు చేసిన బాహుబలి-2 చిత్రం ఇప్పుడు ఓవర్సీస్ లోనూ చరిత్ర సృష్టించే దిశలో సాగుతోంది. ఓవర్సీస్ సినీ ప్రియులు బాహుబలికి అడిక్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. అమెరికాలో గతంలో ఏ సినిమాకు రాని విధంగా కలెక్షన్ల కుంభవర్షం కురిపిస్తోంది బాహుబలి-2. రెండో వీకెండ్.. అంటే 8వ తారీఖు ఆదివారం వరకూ అమెరికాలో బాహుబలి-2.. ఏకంగా ఒక కోటి 60 లక్షల 12వేల 766 డాలర్లు కలెక్ట్ చేసింది.
 
కెనడాలోనూ ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. ఆదివారం వరకూ కెనడాలో 5 లక్షల 82వేల 866 డాలర్లను సంపాదించింది. మొత్తం మీద ఈ రెండు దేశాల్లోనే 16.59 మిలియన్ డాలర్లను (107.34 కోట్ల రూపాయలు) కొల్లగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో బాహుబలి-2 నిలిచింది. లాంగ్‌రన్‌లో ఈ సినిమా 25 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
తెలుగు సినిమాల్లో బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు తప్ప ఓవర్సీస్‌లో ఇంతవరకూ 3 మిలియన్ డాలర్ల మార్కును దాటిన చిత్రాలు లేవు. అలాంటిది బాహుబలి-2 సినిమా కనుక... 25 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలిగితే.. ఈ రికార్డును దాటేయడం అంత సులవు కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments